హైదరాబాద్‌పై సీమాంధ్రులకు ఎలాంటి అధికారాలూ ఉండవు: ఎంపీ కవిత

3 Sep, 2014 04:10 IST|Sakshi
హైదరాబాద్‌పై సీమాంధ్రులకు ఎలాంటి అధికారాలూ ఉండవు: ఎంపీ కవిత

హైదరాబాద్ : ‘హైదరాబాద్ కామన్ క్యాపిటలే తప్ప జాయింట్ క్యాపిటల్ కాదు... దానిపై సీమాంధ్రులకు ఎలాంటి అధికారాలూ ఉండవు’ అని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ప్రభుత్వ రంగ అనుబంధ సంస్థల ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ వచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దామన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల విభజన, ఆస్తులు, అప్పులు అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు.
 
జూన్ 2 తరువాత ఉద్యమాలకు రెస్ట్ ఉంటుందని అనుకున్నాం కాని అది జరగడం లేదని పోలవరం, ఉద్యోగుల విభజన, హైదరాబాద్ ఆస్తులు, గవర్నర్ అధికారాలపై ఇలా నిరంతరం పోరాటం చేస్తూనే ఉండాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఉద్యోగ సంఘం నాయకులు దేవీప్రసాద్, విఠల్, జేఏసీ ప్రతినిధులు రమణరెడ్డి, థామస్‌రెడ్డి, గోవర్ధన్, కనకరాజు, అంజయ్య, వెంకటేశ్వరరావు, కరీముల్లాతో పాటు వివిధ కార్పొరేషన్లకు చెందిన యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు