జీఎస్‌టీపై ప్రత్యేక దృష్టి!

15 May, 2017 00:07 IST|Sakshi
జీఎస్‌టీపై ప్రత్యేక దృష్టి!

వ్యాట్‌ డీలర్ల నమోదు షురూ...
జీఎస్‌టీపై డీలర్లకు అవగాహన సదస్సులు
జూలై 1 నుంచి అమలుకు సన్నాహాలు


సిటీబ్యూరో: దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలుకు రంగం సిద్ధమవుతుండటంతో జీఎస్‌టీపై వాణిజ్య పన్నుల శాఖ దృష్టి సారించింది. జీఎస్‌టీ పరిధిలోకి వచ్చే వ్యాపారులను గుర్తించేందుకు సర్వేకు శ్రీకారం చుట్టింది. మరోవైపు జీఎస్‌టీఎన్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ ద్వారా వ్యాట్‌ పరిధిలోని డీలర్లను జీఎస్‌టీ కింద మార్పు చేస్తోంది.  జీఎస్‌టీ పన్ను విధానంపై సర్కిల్‌ వారిగా సదస్సులు నిర్వహిస్తూ వ్యాపారులకు అవగాహ కల్పిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జీఎస్‌టీ, ఎస్‌జీఎస్‌టీ, ఐజీఎస్‌టీ, యుటీజీఎస్‌టీ నాలుగు పన్నులు అమోదించింది. పన్ను రేట్ల కూడా 6, 12, 18, 28గా విభజించింది. ఆయితే ఏ ఏ వస్తువులపై ఎంత పన్ను విధించాలన్న నిర్ణయం తీసుకోలేదు. జూలై1 నుంచి జీఎస్‌టీ చట్టం అమలులోకి వచ్చే అవకాశం ఉంది. జీఎస్‌టీ కింద రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల లోపు వార్షిక  టర్నోవర్‌ గల వ్యాపారులు కాంపొజిషన్‌లో ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ పరిధిలోకి వచ్చే వ్యాపారులు ప్రభుత్వానికి ఒక శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆయితే రాష్ట్ర పరిధి దాటితే మాత్రం పన్ను రేటులో మార్పు ఉంటుంది. వ్యాపారులందరూ జీఎస్‌టీ కింద నమోదు చేసేవిధంగా విస్తృత అవగాహన కార్యక్రమాలకు అధికారులు శ్రీకారం చుట్టారు.

నగరంలో 1.30 లక్షలపైనే డీలర్లు..
గ్రేటర్‌ హైదరాబాద్‌లోని వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో ఏడు డివిజన్లలు ఉండగా, వాటి పరిధిలో గల 55 సర్కిల్స్‌ ఉన్నాయి. ప్రస్తుతం వ్యాపార సంస్థల టర్నోవర్‌ ఏడాదికి రూ.7.50 లక్షల నుంచి రూ.50 లక్షల టర్నోవర్‌ సంస్థలు టర్నోవర్‌ టాక్స్‌ (టీవోటీ), వ్యాపార టర్నోవర్‌ రూ.50 లక్షలు దాటిన సంస్థలు వ్యాట్‌ (విలువ ఆథారిత పన్ను) పరిధిగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం వ్యాట్‌ డీలర్లుగా 1.11 లక్షలు, టీవోటీ డీలర్లుగా 21 వేల సంస్థలు మాత్రమే నమోదు చేసుకొని ఉన్నాయి. మహానగరంలోని మొత్తం వాణిజ్య, వ్యాపార సంస్థల్లో వ్యాట్, టర్నోవర్‌ టాక్స్‌ కింద నమోదైన సంస్థలు 60 శాతానికి మించి లేనట్లు తెలుస్తోంది. మిగిలిన 40 శాతం సంస్థలు నమోదుకు దూరం పాటిస్తున్నారు. వాటిని సైతం జీఎస్టీ పరిధిలోకి తేచ్చేందుకు వాణిజ్య పన్నుల శాఖ కసరత్తు చేస్తోంది

మరిన్ని వార్తలు