‘ఆ మూడు వర్సిటీల స్టడీ సెంటర్లే నకిలీవి’

19 Aug, 2016 20:53 IST|Sakshi
తెలంగాణలో వివిధ యూనివర్సిటీల స్టడీ సెంటర్ల పేరుతో ఏర్పాటు చేసిన విద్యా సంస్థలు నకిలీవేనని, ఆయా విద్యా సంస్థల్లో చదవొద్దని తెలంగాణ ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, రాజస్థాన్ ఝుంఝునులోని సంఘానియా యూనివర్సిటీ, ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్‌లోని జేఎస్ యూనివర్సిటీల స్టడీ సెంటర్ల పేరుతో తెలంగాణలో విద్యా సంస్థలను ఏర్పాటు చేసి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సును నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది.
 
వాటితోపాటు తెలంగాణలో వివిధ పేర్లతో ఏర్పాటు చేసిన మరో 8 కాలేజీల్లో (గురువారం ఉన్నత విద్యా మండలి పేర్కొన్న జాబితాలోని కాలేజీలు) కూడా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వంకానీ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయంగానీ, యూజీసీకానీ ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసింది. వాటిల్లో చేరి విద్యార్థులు నష్టపోవద్దని వివరించింది. అవన్నీ నకిలీవేనని వివరించింది.
 
 
మరిన్ని వార్తలు