సామాన్యులకే ఇబ్బందులు..

16 Nov, 2016 02:30 IST|Sakshi
సామాన్యులకే ఇబ్బందులు..

- నల్లధనం ఉన్నవారెవరూ బ్యాంకులకు వెళ్లట్లేదు
- పెద్ద నోట్ల రద్దుపై మాజీ ఎంపీ ఉండవల్లి
 
 సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దుతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. ప్రధాని మోదీ ఎటువంటి ముందస్తు చర్యలు తీసు కోకుండా అనాలోచిత నిర్ణయంతో సంక్షో భాన్ని సృష్టించారని విమర్శించారు. మంగళ వారం హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నల్లధనం ఉన్నవారెవరూ బ్యాంకులకు వెళ్ల ట్లేదనే విషయం తన పరిశీలనలో తేలిందని చెప్పారు. విదేశాలనుంచి నల్లధనం తీసు కొచ్చి ప్రతిఒక్కరి అకౌంట్‌లో రూ.15 లక్షలు చొప్పున వేస్తానని మోదీ ఎన్నికల సంద ర్భంగా హామీ ఇచ్చారని, ఇప్పటికి రెండు న్నరేళ్లు గడిచినా ఆ దిశగా తీసుకున్న చర్య లేమీ కన్పించటం లేదని విమర్శించారు. దేశంలో 86 శాతం నగదు పెద్దనోట్లు(500, 1,000) ద్వారానే చెలామణి అవుతోందన్నారు.

బ్లాక్‌మనీని అరికట్టేందుకే పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారని, కానీ రూ.2 వేల నోట్లతో బ్లాక్‌మనీ ఇంకా బాగా పెరుగుతుందన్నా రు. జాతీయ బ్యాంకులవారు ఎవరికి ఎంత డబ్బు ఇస్తు న్నారో.. ఎంత రద్దు చేస్తున్నారో చెప్పట్లేదన్నారు. ఆర్‌బీఐవారు 58 మందికి రూ.85 వేల కోట్ల బకారుులు రద్దు చేసినట్లు సుప్రీం కోర్టు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా సీల్డ్ కవర్‌లో వివరాలు అందజేశారని, వారి పేర్లు ఎందుకు బయటపెట్టరని ప్రశ్నించారు. అక్టోబర్ 21న మైసూర్‌లో రూ.2వేల నోట్లు ప్రింటవుతున్నట్లు, రూ.500, రూ.1,000 నోట్లు రద్దు అవుతున్నట్లు ఓ ఆంగ్ల బిజినెస్ పత్రికలో ముందే వార్త రావడాన్ని ఆయన ప్రస్తావిస్తూ దీంతో నోట్ల రద్దు వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయ న్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల 6.38 లక్షల గ్రామాల్లో ప్రజలకు ఇబ్బంది ఏర్పడింద న్నారు. నోట్ల డిపాజిట్ గడువును మార్చి నెలాఖరు వరకు పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు