ఏడు జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు

26 May, 2016 01:50 IST|Sakshi

హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక
వడదెబ్బకు 61 మంది మృతి
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్, నల్లగొండ జిల్లాల్లో మరో రెండు రోజులపాటుతీవ్ర వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. నాలుగు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం రామగుండంలో అత్యధికంగా 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.
 
 వడదెబ్బకు 61 మంది మృత్యువాత
 మరోవైపు వడదెబ్బతో బుధవారం 61 మంది మృత్యువాత పడ్డారు. ఖమ్మం జిల్లాలో 24 మంది, నల్లగొండ జిల్లాలో 16 మంది,  వరంగల్ జిల్లాలో ఎనిమిది మంది, కరీంనగర్ జిల్లాలో ఐదుగురు, మెదక్ జిల్లాలో ఐదుగురు మరణించారు. నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున చనిపోయారు.
 
 బుధవారం నమోదైన ఉష్ణోగ్రతలు
 
 ప్రాంతం        ఉష్ణోగ్రత
 రామగుండం    46.6
 హన్మకొండ        44.9
 భద్రాచలం         44.8
 ఆదిలాబాద్        43.8
 ఖమ్మం        43.2
 నల్లగొండ        42.8
 నిజామాబాద్    42.7
 మెదక్        42.2
 హైదరాబాద్        40.5
 

>
మరిన్ని వార్తలు