గూగుల్ సీఈవోకు ఇమ్మిగ్రెంట్ అవార్డ్!

29 Jun, 2016 18:59 IST|Sakshi
గూగుల్ సీఈవోకు ఇమ్మిగ్రెంట్ అవార్డ్!

న్యూయార్క్ః నలుగురు ప్రవాస భారతీయులకు అమెరికా ప్రత్యేక గౌరవం దక్కింది. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తో పాటు మరో ముగ్గుర్ని ఈప్రత్యేక పురస్కారం వరించింది. జూన్ 30న జరిగే కార్యక్రమంలో ఎంపికైన వారిని అమెరికాలోని కార్నీజియా కార్పొరేషన్ సత్కరించనుంది.

అమెరికాకు గర్వకారణమైన నలుగురు ప్రవాస భారతీయులకు ఆదేశం ప్రత్యేక గౌరవాన్ని అందించనుంది.  'గ్రేట్ ఇమ్మిగ్రెంట్ః ప్రైడ్ ఆఫ్ అమెరికా' పేరిట కార్నెగీ కార్పొరేషన్ ఈ అవార్డులను ప్రతి యేటా అందిస్తుంది. 2016 సంవత్సరానికి గానూ విదేశీ మూలాలు కలిగిన మొత్తం 30 దేశాలకు చెందిన 42 మందిని పురస్కారాలకు ఎంపిక చేయగా.. వారిలో ప్రవాస భారతీయులు నలుగుర్ని ఈ ప్రత్యేక పురస్కారం వరించింది.

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తో పాటు పీబీఎస్ న్యూస్ అవర్ కు చెందిన ప్రఖ్యాత వ్యాఖ్యాత, సినియర్ కరస్పాండెంట్ హరి శ్రీనివాసన్, మెకన్సీ అండ్ కంపెనీ ఛైర్మన్ విక్రమ్ మల్హోత్రా, నేషనల్ బుక్ క్రిటిక్ సర్కిల్ అవార్డు విజేత, రచయిత భారతీ ముఖర్జీలకు ప్రైడ్ ఆఫ్ అమెరికా అవార్డును అందించనున్నారు. జూన్ 30న న్యూయార్క్ లో నిర్వహించే కార్యక్రమంలో ఎంపికైన వారికి కార్నీజియా కార్పొరేషన్ పురస్కారాలను ప్రదానం చేస్తుంది. అవార్డుకు ఎంపికైన వారంతా చదువు, ఆర్థికావకాశాలు, మతపరమైన శరణార్థులు, భద్రత వంటి అనేక అవసరాలతో అమెరికా వచ్చి స్థిరపడినవారని కార్నీజియా కార్పొరేషన్ ఛైర్మన్ గ్రెగోరియన్ తెలిపారు.

మరిన్ని వార్తలు