అమెరికన్ సూపర్ టాలెంట్.. వైరల్ వీడియో

3 Jun, 2017 10:22 IST|Sakshi
అమెరికన్ సూపర్ టాలెంట్.. వైరల్ వీడియో

వాషింగ్టన్: ఓ అమెరికన్ వ్యక్తి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎలాంటి వల వేయకుండా, గాలెం సాయం లేకుండా చేతులతో చేపను చాకచక్యంగా పట్టడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలివి.. అమెరికాలోని అలబామాకు చెందిన రాబర్ట్ ఎర్ల్ వూడార్డ్ కు చేపలు పట్టడం ఓ సరదా. తీరికవేళల్లో మరికొందరితో కలిసి తీరానికి వెళ్లి తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటాడు రాబర్ట్.

గత నెల 18న ఇదే విధంగా చేపల వేటకు చిన్న నెట్ తీసుకెళ్లాడు. నెట్ గానీ, గాలెం కానీ వాడకుండా.. ఓ చిన్నచేపను ఎరగా వేసి ఓ పెద్ద చేపను క్షణాల్లో పట్టేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి.. రాబర్ట్ పేరు మార్మోగిపోతోంది. ఎంతో వేగంగా స్పందించి కేవలం ఒంటిచేత్తో పెద్ద చేపను పట్టడాన్ని వీడియోలో చూడవచ్చు. కొన్ని క్షణాల తర్వాత ఆ చేపను మళ్లీ నీళ్లలో వదిలిపెట్టాడు. 

మరిన్ని వార్తలు