అత్యున్నత పదవి చేపట్టిన తొలి మహిళ

23 Feb, 2017 10:05 IST|Sakshi
లండన్‌: బ్రిటన్‌ హొం సెక్రటరీ అంబర్‌ రుడ్‌ స్కాట్‌లాండ్‌ యార్డ్‌కు మహిళ పోలీస్‌ ఆఫీసర్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టునుందన్నారని మీడియా  రిపోర్టర్స్‌ చెప్పారు.  క్రిసీడ డిక్‌ అత్యున్నతమైన పదవికి ఎన్నికయ్యారు. ఒక మహిళ ఈ పదవి చెపట్టడం 187 సంవత్సరాల లండన్‌ చరిత్రలోనే మొదటిసారి. బ్రిటన్‌లోనే అతిపెద్ద పోలీస్‌ పోర్స్‌ను ఒక మహిళ కంట్రోల్‌ చేయనుంది. 43,000 మంది ఉద్యోగులు, ఏడాదికి బడ్జెట్‌ 3 బిలియన్‌ పౌండ్స్‌ కేటాయించే పోలీస్‌ ఫోర్స్‌ను మహిళ నడపనుందని రుడ్‌ తెలిపారు. బ్రిటన్‌ రాణి ఏలిజబెత్‌ 2 డిక్‌ను ఈ పదవికి ఎన్నిక చేశారు. ఈ సందర్భంగా రుడ్‌ మాట్లాడుతూ దేశంలో కొనసాగుతున్న మోసాలను, సైబర్‌ క్రైంను కంట్రోల్‌ చేయడంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. లండన్‌ మేయర్‌ సాదిక్‌ ఖాన్‌ మాట్లాడుతూ 187 సంవత్సరాల లండన్‌ చరిత్రలో ఈ పదవిని చేపట్టిన మొదటి మహిళ డిక్‌ అని పేర్కొన్నారు.  ఈ భూమి మీదనే అత్యంత శక్తివంతమైన పోలీస్‌ ఆఫీసర్‌ అని కొనియాడారు. ఆమె అనుభవాన్ని,సామర్థ్యాన్ని ముందు ప్రదర్శిస్తారని మేయర్‌ అన్నారు.
 
 
మరిన్ని వార్తలు