ఆస్ట్రియాలో బురఖాపై నిషేధం

2 Oct, 2017 12:50 IST|Sakshi

వియాన్నా : మొహం కనిపించకుండా మాస్క్‌లు ధరించడాన్ని ఆస్ట్రియా ప్రభుత్వం నిషేధించింది. ఇందులో ముస్లిం మహిళలు సంప్రదాయంగా ధరించే బురఖాలను కూడా చేర్చింది. అంతేకాక ఆసుపత్రుల్లో ఆపరేషన్ల సమయంలే ధరించే ఫేస్‌ మాస్క్‌లను కూడా బయట ప్రదేశంలో ధరించరాదని ఆస్ట్రియా ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు కఠినంగా ఉంటాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఇప్పటికే బురఖాను ఫ్రాన్స్‌, బెల్జియం, జర్మనీ తదితర దేశాలు నిషేధించాయి.

మరిన్ని వార్తలు