కోట్ల ఏళ్ల కిందట మార్స్‌పై మహా సముద్రం

7 Mar, 2015 04:05 IST|Sakshi

వాషింగ్టన్: అరుణగ్రహంపై నీటి జాడల కోసం అన్వేషిస్తున్న అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఓ ఆసక్తికర విషయాన్ని కనుగొంది. సుమారు 430 కోట్ల సంవత్సరాల క్రితం మార్స్‌పై మహా సముద్రం ఉండేదని...అరుణగ్రహం ఉపరితలాన్ని సుమారు 450 అడుగుల మేర ముంచేంత స్థాయిలో అందులో నీరు ఉండేదని గుర్తించింది. అందులోని నీటి పరిమాణం భూమిపై ఉన్న ఆర్కిటిక్ మహాసముద్రంకన్నా చాలా ఎక్కువగా ఉండేదని...మొత్తంగా మార్స్ మహాసముద్రంపై 2 కోట్ల క్యూబిక్ కిలోమీటర్ల నీరు ఉండేదని లెక్కగట్టింది. ఇది మార్స్ ఉత్తర ధ్రువాన్ని దాదాపు ఆక్రమించేంత స్థాయిలో ఉండేదని అధ్యయనంలో అంచనా వేసింది. కాలక్రమేణా 87 శాతం నీరు అంతరిక్షంలో కలిసిపోయిందని పేర్కొంది. మార్స్‌పై  నీరు ఉండేదని తేలడంతో అక్కడ జీవం కూడా సుదీర్ఘకాలంపాటు కొనసాగి ఉండేదని అభిప్రాయపడింది.

మరిన్ని వార్తలు