స్వైన్‌ఫ్లూ రాకుండా వార్షిక టీకా | Sakshi
Sakshi News home page

స్వైన్‌ఫ్లూ రాకుండా వార్షిక టీకా

Published Sat, Mar 7 2015 4:01 AM

Annual flu vaccine to prevent

కోల్‌కతా: స్వైన్‌ఫ్లూ తదితర అంటువ్యాధులు రాకుండా నివారించడానికి సంవత్సరానికి ఒక సారి ఫ్లూ టీకా వేయించుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) సూచించింది. ఈ టీకా పలు ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లను నివారిస్తుందని తెలిపింది. భారత్‌లో ఈ ఏడాది 23 వేల స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా 1,239 మంది మృతి చెంది నట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. వీరిలో 300  మంది గుజరాత్ వారని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఇన్‌ఫ్లుయెంజా వైరస్ వేగంగా విస్తరిస్తున్నాయని, ఇన్‌ఫ్లుయెంజాతో గర్భిణులకు, చిన్నపిల్లలకు, ముసలివాళ్లకు ప్రమాదం ఉంటుందని వెల్లడించింది. కాగా, మార్చి 4 వరకు భారత్‌లో 23,153 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Advertisement
Advertisement