మనషుల పుర్రెలతో పండుగ చేస్తారంట..!

15 Nov, 2017 16:58 IST|Sakshi

బొలివీయా: కుటుంబంలో చనిపోయిన వారి ప్రతిరూపంగా వారిపేరు మీద ధాన ధర్మాలు చేయటం మనం చూసింటాం. కానీ బొలివియా ప్రజలు మాత్రం తమదైన రీతిలో ప్రేమను చాటుకుంటున్నారు. ప్రతి సంవత్సరం నవంబర్‌ నెలలో బొలివీయా ప్రజలు నటిటాస్‌ పండుగ జరుపుకుంటారు. కుంటుంబంలో చనిపోయిన వారి పుర్రెలను పూలతో చాలా అందంగా డెకరేట్‌ చేస్తారు. వాటిని ఈ సందర్భంగా ఎంతగానో ఆరాదిస్తారు. చనిపోయిన వాళ్లు మళ్లీ పుడుతారనే నమ్మకంతో ఈ విధంగా చేస్తారు. అంతేకాక తమ జీవితం చాలా అందంగా ఉండేలా చూడాలని ఆ పుర్రెలను కోరుతారు.

అంతేకాక వారి ప్రతిరూపంగా పుర్రెలను తమతో కుటుంబాలు ఉంచుకుంటాయంట. మరికొందరు ఆ పుర్రెలను ప్రార్థన ఆలయాలకు తీసుకెళ్లి ప్రార్థనలు చేస్తారని తెలిసింది. ఆ పుర్రెలను వారు పూలతో, కళ్లజోడు పెట్టి రకరకాలుగా ఆలంకరించి వారి ప్రేమను ఈ విధంగా చూపిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఈ పండుగను డ్యాన్స్‌లతో చాలా సంతోషంగా జరుపుకుంటారని తెలుస్తోంది. మరికొన్ని పుర్రెలకు కుటుంబంలోని సభ్యులు సిగరేట్స్‌ నోట్లో పెట్టి, వాటి ముందు కొవ్వొత్తి పెట్టి అంటించుకున్నట్లుగా పెట్టి అభిమానాన్ని ఇలా చూపించారు.

మరిన్ని వార్తలు