మార్స్ రోవర్ డిజైన్లు విడుదల చేసిన చైనా

25 Aug, 2016 13:16 IST|Sakshi

బీజింగ్: అంగారక గ్రహం పైకి 2020లో పంపించనున్న రోవర్‌కు సంబంధించిన డిజైన్లను చైనా విడుదల చేసింది. 2020 జూలై లేదా ఆగస్టులో ఈ రోవర్‌ను అంగారక గ్రహం మీదకి పంపించనున్నట్లు మార్స్ మిషన్ చీఫ్ ఆర్కిటెక్ట్ జాంగ్ తెలిపారు. ఆరు చక్రాలు, నాలుగు సౌరఫలకాలున్న దీని బరువు 200కేజీలని పేర్కొన్నారు.

మూడు మార్షియన్ నెలల పాటు సేవలందించేలా దీనిని రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. అక్కడి వాతావరణం, ఉపరితలం, అంతర్గత, భౌతిక నిర్మాణం, అయాన్ ఆవరణాన్ని రోవర్ అధ్యయనం చేస్తుందని జాంగ్ వెల్లడించారు. అలాగే దీనికి లోగో రూపకల్పనతో పాటు పేరు పెట్టాలని ప్రజల్ని ఆహ్వానిస్తున్నామన్నారు. కాగా, మార్స్ మిషన్‌లో అమెరికా, రష్యా, యురోపియన్ యూనియన్, భారత్‌లు విజయం సాధించగా.. చైనా 2011లో ప్రయత్నించి విఫలమైంది.

మరిన్ని వార్తలు