ఇదుంటే మన ‘పంట’ పండినట్లే..

10 Dec, 2014 17:25 IST|Sakshi
ఇదుంటే మన ‘పంట’ పండినట్లే..

పక్షులు పంటలను పాడు చేయకుండా ఉండటానికి పొలాల్లో దిష్టి బొమ్మలు పెట్టడాన్ని మనం చూసే ఉంటాం. అవున్నా.. పక్షులు పెద్దగా పట్టించుకోవనుకోండి.. అయితే.. ఇలాంటి వాటికి చెక్ పెట్టేలా హాలండ్‌లో రోబో దిష్టిబొమ్మను రంగంలోకి దించారు. దాని పేరు అగ్రిలేజర్. ఈ యంత్రాన్ని ఆ దేశానికి చెందిన వ్యవసాయ, పర్యావరణ కేంద్రం శాస్త్రవేత్తలు రూపొందించారు. కంప్యూటర్‌కు అనుసంధానించి ఉండే ఈ రోబో పొలం అంతటా లేజర్ కిరణాలను వెద్టజల్లుతూ ఉంటుం ది. దీని వల్ల పక్షులు భయపడి పారిపోతాయట. 3 వేల ఎకరాలకు ఒక రోబో దిష్టిబొమ్మ చాలట. దీని ఏర్పాటు చాలా సులువని, ఖర్చులు కూడా ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 

>
మరిన్ని వార్తలు