80కి చేరిన కరోనా మృతుల సంఖ్య

27 Jan, 2020 09:14 IST|Sakshi

చైనాను గజ గజ వణికిస్తోన్న కరోనా వైరస్‌

రోజు రోజుకు పెరుగుతున్న మృతుల సంఖ్య

బీజింగ్‌:   చైనాలో కరోనా వైరస్‌ చాప కింద నీరులా విస్తరిస్తోంది. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య రోజు రోజుకు అనూహ్యంగా పెరుగుతోంది. ఇప‍్పటివరకూ కరోనా మృతుల సంఖ్య 80కి చేరింది. మరోవైపు సుమారు 3000మంది ఈ వైరస్‌ బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. వారిలో 300మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు  చైనా సర్కార్‌ పేర్కొంది. చైనాలోని వూహాన్‌ నగరంలో తొలిసారిగా బయటపడిన కరోనా వైరస్‌ నెమ్మదిగా ఇతర దేశాలకు శరవేగంగా వ్యాపిస్తోంది. దగ్గు, జలుబుతో మొదలయ్యే లక్షణాలు సార్స్‌, న్యుమోనియా వంటి వ్యాధుల్లోకి దింపుతోంది. (కరోనా ప్రకంపనలు: హెల్ప్లైన్)


మరోవైపు కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు చైనా ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వైరస్‌కు మూలకేంద్రంగా భావిస్తున్న వూహాన్‌ నగరంలో కొత్తగా ఇంకో ఆసుపత్రిని నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రెండు వారాల్లోపు ఇక్కడ 1000 పడకలతో మరో ఆసుపత్రిని కడతామని ప్రభుత్వం చెబుతోంది. (కరోనా వైరస్తో 6.5 కోట్ల మందికి ముప్పు!)

మరిన్ని వార్తలు