కష్టమే.. అయినా తప్పదు: ఇటలీ ప్రధాని

11 Apr, 2020 11:30 IST|Sakshi

మరోసారి లాక్ డౌన్ పొడిగించిన ఇటలీ

 మే 3వరకు లాక్ డౌన్ పొడిగింపు

రోమ్ : కరోనా వైరస్ కారణంగా భారీ ప్రభావితమైన దేశం ఇటలీ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. మరణాలు, పాజిటివ్  కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ మే 3వ తేదీవరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం కష్టమే అయినా.. తప్పడం లేదని ఇటలీ ప్రధాన మంత్రి గియుసేప్ కాంటే  శుక్రవారం ప్రకటించారు.  

ప్రస్తుతం కొనసాగుతున్నలాక్ డౌన్ త్వరలో (ఏప్రిల్,13) ముగియనున్ననేపథ్యంలో మినహాయింపులతో తాజా నిర్ణయం తీసుకుంది.అయితే కదలికలపై కఠినమైన ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. కష్టమైందే.. కానీ ఇది చాలా అవసరమైన నిర్ణయం. దీనికి తాను బాధ్యత తీసుకుంటానని కాంటే వెల్లడించారు. అయితే కొన్ని మినహాయింపులను ప్రకటించారు. బుక్ షాపులు, స్టేషనరీ, పిల్లల బట్టలు దుకాణాలు మంగళవారం నుండి తిరిగి తెరుచుకుంటాయని కాంటే చెప్పారు. కోవిడ్-19 కేసుల రోజువారీ ధోరణిని పరిశీలిస్తూ, పరిస్థితులు అనుకూలిస్తే, తదనుగుణంగా వ్యవహరిస్తానని ప్రధాని అక్కడి ప్రజల్లో కొత్త ఆశలు రేపారు.  లాక్ డౌన్  కాలంలో మూతపడిన కర్మాగారాలు మాత్రం మూసిసే వుంటాయని ప్రకటించారు. (కరోనా: శరవేగంగా ఆర్థిక వ్యవస్థ పతనం)

సాధారణ ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ ప్రారంభించాలని వ్యాపార వర్గాలు ఒత్తిడి చేస్తున్నాయి. కానీ తాజా నిర్ణయంతో వాణిజ్య కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని, లేదంటే ఆర్థిక విపత్తు తప్పదని హెచ్చరించిన పరిశ్రమల పెద్దల ఆశలపై నీళ్లు చల్లారు. కార్మికుల వేతనాలు లేక, మార్కెట్ వాటాను శాశ్వతంగా కోల్పోయే అవకాశం ఉందని అక్కడి ఆర్థిక నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. మరోవైపు సడలింపు కొత్త వ్యాప్తికి కారణమవుతుందని, సాధ్యమైనంత కఠినంగా లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగించాలని వైద్య , ఇతర నిపుణులు  వాదిస్తున్నారు.  (కరోనా: ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం)

ఇటలీలో కరోనా వైరస్ విజృంభణతో ఆ దేశ ప్రభుత్వం మార్చి 10 నుండి ఏప్రిల్ 3 దాకా ఆ తరువాత ఏప్రిల్ 13 వరకూ లాక్డౌన్  పొడిగించింది. కొన్ని మినహాయింపులతో మే 3 వరకు లాక్ డౌన్ తప్పనిసరి చేసింది. ఇటలీలో వైరస్ కారణంగా ఇప్పటివరకు దాదాపు 19,000 మరణాలు నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు