వైరల్‌: కాకిని చూసి బుద్ది తెచ్చుకోండయ్యా!

24 Aug, 2019 10:30 IST|Sakshi

న్యూయార్క్‌ :  'కాకిలా కలకాలం బతికేకంటే హంసలాగా ఒక్కరోజు బతికినా చాలు' అంటుంటారు సాధారణంగా. మనిషి ఎలా బ్రతకకూడదో కాకుల్ని ఉదాహరణగా చూపుతుంటారు. కానీ నేటి సమాజంలో కాకుల్ని చూసి మనిషి నేర్చు కోవాల్సింది చాలా ఉందని అవి నిరూపిస్తున్నాయి. ఓ కాకి చేసిన చిన్న పని దాన్నో ఇంటర్నెట్‌ హీరోను చేసేసింది. దాని తెలివికి నెటిజన్లు జోహార్లు చేస్తున్నారు. ఇంతకీ సంగతేంటంటే.. ప్లాస్టిక్‌ బాటిల్‌ను నోటితో పట్టుకుని రీసైకిల్‌ డస్ట్‌ బిన్‌మీద వాలిన ఓ కాకి బాటిల్‌ను డస్ట్‌బిన్‌ లోపల వేయటానికి ప్రయత్నిస్తుంది. కొద్దిసేపు ప్రయత్నించి దాన్ని లోపలపడేసి ఎగురుకుంటూ వెళ్లిపోతుంది.

ఇందుకు సంబంధించిన వీడియోను అమెరికాకు చెందిన ఓ వ్యక్తి స్టాన్స్‌ గ్రౌండెడ్‌ అనే ట్విటర్‌ ఖాతాలో ఉంచాడు. దీంతో ఆ కాకి సోషల్‌ మీడియా ఫేమ్‌ అయిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీడియోను చూసిన చాలా మంది నెటిజన్లు ‘‘కాకులు చాలా తెలివైనవి.. ఆ కాకిని చూసి మనిషి బుద్ది తెచ్చుకోవాలి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి : మహిళ అతి తెలివి.. గోధుమ పిండితో..

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విదేశాల్లోనూ టీకాను పరీక్షిస్తాం: చైనా 

పేషెంట్‌ జీరో ఎవరు?

అమెరికాలో అసాధారణం 

ఉద్యోగాలు ఊడుతున్నాయ్‌!

కరోనా: మృత్యుఘంటికలు

సినిమా

స్ఫూర్తి నింపేలా...

మిస్‌ యు

హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌ 

ఆ వార్తలు నిజం కాదు

ప్రజల కోసం చేసిన పాట ఇది

భార్య, పిల్లలు విదేశాల్లో చిక్కుకుపోయారు: విష్ణు