‘అన్ని రోడ్లు రోమ్‌’కే వెళ్లాయి!

26 Nov, 2019 17:16 IST|Sakshi

‘ఆల్‌ రోడ్స్‌ లీడ్‌ టు రోమ్‌ (అన్ని రోడ్లు రోమ్‌కే వెళతాయి)’ అన్న నానుడి చారిత్రకంగా అక్షర సత్యమని తేలింది. ఇటలీ రాజధాని రోమ్‌ నగర పరిసరాల్లోని 29 చోట్ల పురాతత్వ శాస్త్రజ్ఞుల తవ్వకాల్లో బయట పడిన 12వేల సంవత్సరాల క్రితం నాటి 127 మంది మానవుల చెవి భాగాలపై డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించగా ఆశ్చర్యకరమైన అంశాలు బయట పడ్డాయి. అప్పటికే రోమ్‌ నగరానికి గ్రీకులు, సిరియన్లతోపాటు లెబనాన్‌ దేశస్థులు వలసవచ్చారని తేలింది. 127 మానవుల చెవుల్లో ఈ మూడు దేశాల ప్రజల డీఎన్‌ఏలు బయటపడ్డాయి. 

రోమ్‌ నగరం విశిష్టతకు సంబంధించి ఇప్పటికే ఆర్కియాలోజీ, చారిత్రక నివేదికలెన్నో తెలియజేస్తున్నాయి. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా ఈ విషయాలను ధ్రువీకరించడం పెద్దగా జరగలేదు. ఆ దిశగా ఇది ముందడుగు అని చెప్పవచ్చు. పాశ్చాత్య యూరప్‌ సామ్రాజ్యం పతనమయ్యాక నాలుగో శతాబ్దంలో గ్రీస్, సిరియా, లెబనాన్‌ నుంచి రోమ్‌ నగరానికి భారీగా వలసలు పెరిగాయని స్టాన్‌ఫోర్డ్, ఇటాలియన్‌ యూనివర్శిటీలకు చెందిన పరిశోధకులు తెలిపారు. 

మరిన్ని వార్తలు