అతడికి మతిపోయింది.. నన్నేం పీకలేడు

4 Jan, 2018 08:38 IST|Sakshi

వాషింగ్టన్‌ : వైట్‌హౌజ్‌ మాజీ ఉద్యోగి స్టీవ్‌ బన్నొన్‌ ఓ పుస్తకంలో చేసిన వ్యాఖ్యలు అమెరికాలో పెను కలకలమే రేపుతోంది. అధ్యక్షభవన సమాచారాన్ని బహిర్గత పరచటంతోపాటు.. అవినీతి, అసమర్థత పాలన అంటూ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఆయన తీవ్ర విమర్శలు పుసక్తంలో చేశారు. 

ముఖ్యంగా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్‌ తనయుడు, ఓ రష్యన్‌ లాయర్‌తో భేటీ అయ్యారని.. అది ముమ్మాటికీ దేశవ్యతిరేక చర్యేనని బన్నోన్‌ అందులో పేర్కొన్నారు. దీంతో ప్రతిపక్షాలు, బిలినియర్లు ట్రంప్‌ ను నిలదీయగా.. అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించాల్సి వచ్చింది. ‘‘స్టీవ్‌ బన్నొన్‌ నన్ను, నా అధ్యక్ష పదవిని ఏం చేయలేడు. అతడి ఉద్యోగం మాత్రమే కాదు.. మతిని కూడా పొగొట్టుకున్నాడు. వాడొక పిచ్చోడు. వాడికి మైండ్‌ పోయింది. పట్టించుకోకండి’’ అంటూ ట్రంప్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

కాగా, ‘ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ : ఇన్‌సైడ్‌ ద ట్రంప్‌ వైట్‌ హౌజ్‌’ అనే ఆ పుస్తకాన్ని బన్నోన్‌ అందించిన సమాచారం మేరకు మైకేల్‌ వోల్ఫ్‌ అనే జర్నలిస్ట్‌ ప్రచురిస్తున్నారు. ఇదే పుసక్తంలో ట్రంప్‌ నోటి నుంచి వచ్చిన కొన్ని సంచలన వ్యాఖ్యలను.. రష్యాతో ట్రంప్‌ కుటుంబం కొనసాగించిన సత్సంబంధాలు గురించి కూడా ఆయన ప్రస్తావించాడంట. వచ్చే వారమే ఆ పుసక్తం ముద్రణ కానుంది. 

కాగా, అభ్యంతరాలు వ్యక్తం అయినప్పటికీ.. ఏరి కోరి శ్వేతసౌధం ముఖ్య వ్యూహకర్తగా బన్నోన్‌ను నియమించుకున్న ట్రంప్‌..  అధ్యక్ష ఎన్నికల్లో మనీలాండరింగ్‌ ఆరోపణలు రావటంతో గత ఆగస్టులో ఆయనను పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఎఫ్‌బీఐ నుంచి విచారణ ఎదుర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు