అద్దెకు ఈఫిల్ టవర్!

21 May, 2016 08:48 IST|Sakshi
అద్దెకు ఈఫిల్ టవర్!

పారిస్: యూరో ఫుట్ బాల్-2016 సందర్భంగా రెంటల్ కంపెనీ కస్టమర్లకు ఓ అద్భుత అవకాశాన్ని కల్పించింది. ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్‌లో నాలుగు రోజుల పాటు నివసించేందుకు నలుగురు లక్కీ కస్టమర్లను ఓ పోటీ ద్వారా ఎన్నుకోనుంది. ఇందుకోసం గురువారం నుంచి పోటీని ప్రారంభిస్తున్నట్లు కంపెనీ సీఈవో బ్రియాన్ షార్పెల్స్ తెలిపారు.

ఈఫిల్ టవర్‌లోని మొదటి అంతస్తులో గల 300 చదరపు అడుగుల గదిలో బస కోసం ఇప్పటికే ఏర్పాట్లను మొదలు పెట్టేసింది. ఇక్కడి నుంచి ఆర్క్ డీ ట్రిమోఫె, ది సాక్రె కోయూర్, సీయన్ నదిని చూడొచ్చని తెలిపింది. జీవితాకాలం చెప్పుకోదగ్గ జ్ఞాపకాల్లో ఇదొకటిగా ఎంపికైన కస్టమర్లకు మిగిలిపోతుందని బ్రియాన్ అన్నారు.

మరిన్ని వార్తలు