ఎప్పటికీ 'గే' లా ఉండిపోతాను..!

14 Jun, 2016 16:21 IST|Sakshi
ఎప్పటికీ 'గే' లా ఉండిపోతాను..!

బీజింగ్: తాను ఎప్పటికీ స్వలింగ సంపర్కుడిగానే ఉంటానని, ఈ విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని చైనాకు కు చెందిన ఓ పండ్ల వ్యాపారి అంటున్నాడు. ఆస్పత్రి యాజమాన్యం తనను వేధించారని, చట్టప్రకారం తనకు ఎన్నో సౌలభ్యాలున్నాయంటూ కోర్టును ఆశ్రయించాడు. ఆ వివరాలిలా ఉన్నాయి.. నార్త్ చైనాకు చెందిన పండ్ల వ్యాపారి యుహు. అతడి భార్య యాంగ్. భర్త స్వలింగ సంపర్కుడు(గే) అని తెలిసి ఆమె షాక్ కు గురైంది. ఆ తర్వాత భార్య, కుటుంబసభ్యులు కలిసి అతడికి ట్రీట్ మెంట్ ఇప్పించి సరిచేయాలనుకున్నారు.

డ్రగ్స్, కొన్ని రకాల ఇంజెక్షన్ల సహాయంతో హోమోసెక్సువల్ గా ఉన్న వ్యక్తిగా సాధారణ వ్యక్తులుగా చేస్తామని ఝుమాడియన్ పీపుల్స్ హాస్పిటల్ సైకియాట్రిస్ట్ వీరిని నమ్మించాడు. గతేడాది అక్టోబర్ లో 'సెక్సువాలిటీ కరెక్షన్ థెరపీ' కోసం యుహును ఆ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్సలో భాగంగా యోగా చేయించడం, ఇంజెక్షన్లు ఇవ్వడం చేసేవారు. వీటితో పాటు శారీరకంగా, మానసికంగా తనను వేధించారని, అసభ్య పదజాలంతో దూషించేవారని యుహు చెబుతున్నాడు. అందరికీ తాను ఒక్క విషయం చెప్పాలనుకున్నానని, హోమోసెక్సువల్ గా ఉండటం అనేది వ్యాధి కాదు అని యుహు తెలిపాడు. దీనికి చికిత్స ఉండదని, హాస్పిటల్స్ ను తాను ఈ విషయంపై హెచ్చరిస్తున్నట్లు ప్రకటించాడు. తన భర్తను తీవ్రంగా వేదించారని, డ్రగ్స్ తీసుకోవాలంటూ కొట్టేవారని, ఆస్పత్రిలో బెడ్ కు కట్టేశారని యాంగ్ తెలిపింది.

ఎల్జీబీటీ హక్కుల కార్యకర్త హాకియాంగ్ దృష్టికి ఈ విషయం రాగానే ఆసుపత్రిపై పోరాటం చేసి యుహుకు స్వేచ్ఛను అందించాడు. 1997నుంచి హోమోసెక్సువాలిటీ అక్కడ చట్టపరంగా ఉంది. పేషెంట్ ఇంటికి వెళ్లిపోతాను, చికిత్స వద్దంటూ వేడుకున్నా యుహును గతంలో విడిచి పెట్టలేదన్నాడు. స్థానిక కోర్టులో పిల్ దాఖలుచేశారు. ఈ కేసు విచారణకు కోర్టు అంగీకరించింది. సగం విజయం సాధించామని యుహు కుటుంబం పేర్కొంది. ఈ విషయంపై హాస్పిటల్ యాజమాన్యాన్ని సంప్రదించగా తమకు కోర్టు నుంచి ఇప్పటివరకూ ఎలాంటి లీగల్ నోటీసులు రాలేదని వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు