‘నీరవ్‌ అరెస్టుపై నిర్ణయం హాంకాంగ్‌దే’

10 Apr, 2018 02:38 IST|Sakshi

బీజింగ్‌: హాంకాంగ్‌లో తలదాచుకున్న వజ్రాల వ్యాపారి, పీఎన్‌బీ స్కాం కీలక నిందితుడు నీరవ్‌ మోదీ అరెస్టు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ‘సరెండర్‌ ఆఫ్‌ ఫ్యుజిటివ్‌ అఫెండర్స్‌ అగ్రిమెంట్‌’ కింద నీరవ్‌ను అరెస్టు చేయాలని ఇప్పటికే హాంకాంగ్‌కు భారత్‌ విజ్ఞప్తి చేసింది. భారత్‌ ప్రతిపాదనపై హాంకాంగ్‌ స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చని చైనా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మరోవైపు, స్కాం కేసులో కొనసాగుతున్న దర్యాప్తును తాను పర్యవేక్షించబోనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే కోర్టు పర్యవేక్షణలో సిట్‌ విచారణ జరపాలంటూ దాఖలైన పిల్‌ విచారణార్హమా? కాదా? అన్న అంశంపై నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం పేర్కొంది.
 

మరిన్ని వార్తలు