బతుకుపై ఆశ ఉంటే ఈ నగరాలకు పోవద్దు!

20 Apr, 2016 18:08 IST|Sakshi
బతుకుపై ఆశ ఉంటే ఈ నగరాలకు పోవద్దు!

లండన్: లాంగ్ హాలీడేస్ వస్తే చాలు.. వెంటనే ఓ టూర్ వేయాలనే ఆలోచన వచ్చేస్తుంది. అది కూడా యూరప్ టూర్ అనే విషయం మదిలో మెదులుతుంది. అయితే, నిజానికి పర్యాటకానికి యూరప్ చాలా చక్కటి ఖండమే కానీ, అక్కడ ఉన్న సంపన్న దేశాలు మాత్రం ఇప్పుడు అతిపెద్ద సమస్యను ఎదుర్కొంటున్నాయి. అదే ఉగ్రవాదం.

ఈ ప్రాంతాల్లోని సేద తీరే చోట్లే లక్ష్యంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారని ఓ సర్వే తెలిపింది. అంతేకాదు.. యూరప్ టూర్ వేయొచ్చుకానీ, అక్కడి ఏ దేశాల్లోని నగరాలు సురక్షితంకావో అనే విషయాలు కూడా వెల్లడించింది. ఇది తెలిపిన వివరాల ప్రకారం స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలు ఉగ్రవాద హిట్ లిస్ట్ లో ఉన్న దేశాలని, ఇక్కడికి వెల్లడం ఒక రకంగా ఎక్కువ తీవ్రత ఉన్న సమస్యలోకి వెళ్లడమేనని అంటోంది. ఒక్కసారి యూరప్ లో ఏ నగరాలు ఉగ్రవాద భారిన ఉన్నాయో పరిశీలిస్తే..

ఉగ్రవాద సమస్య ఎక్కువగా ఉన్న దేశాలివే..
స్పెయిన్                      
ఫ్రాన్స్  
జర్మనీ
బెల్జియం
సాధారణ పరిస్థితులు ఉండే దేశాలు
ఇటలీ
డెన్మార్క్
గ్రీస్
క్రొయేషియా
పోర్చుగల్ (కొంచెం ఆలోచించాల్సిన నగరం)
ఉగ్రవాద సమస్య ఎక్కువగా ఉన్న దేశాలివే..
ఈజిప్టు
ట్యూనిషియా
టర్కీ

మరిన్ని వార్తలు