భారత్‌పై పాక్‌ వివాదాస్పద వ్యాఖ్య

28 May, 2020 06:26 IST|Sakshi

ఇస్లామాబాద్‌: భారత్‌–చైనా సరిహద్దుల మధ్య వివాదాలు ముదురుతున్న వేళ పాకిస్తాన్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ భారత్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం తీసుకుంటున్న దురహంకారపూరిత విస్తరణ విధానాల వల్ల పొరుగు దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని, ఈ విషయంలో భారత్‌ తనతో సరిహద్దు పంచుకుంటున్న దేశాలకు ముప్పుగా మారిందని ఇమ్రాన్‌ ట్వీట్‌ చేశారు. పౌరసత్వ చట్టం వల్ల బంగ్లాదేశ్‌ కు, నేపాల్, చైనాలతో సరిహద్దు వివాదాలు, ఫ్లాగ్‌ ఆపరేషన్‌తో పాక్‌కు భారత్‌ ముప్పుగా మారిందని అన్నారు. పాకిస్తాన్‌కు చైనా మిత్రదేశం కావడంతో పాకిస్తాన్‌ ఈ వ్యాఖ్యలు చేసింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు