'భారత్లోనే పుట్టాను.. వీడలేని బంధం నాది'

16 Nov, 2016 13:08 IST|Sakshi
'భారత్లోనే పుట్టాను.. వీడలేని బంధం నాది'

వాషింగ్టన్: భారత్ తనకు చాలా ముఖ్యమైన దేశమని భారతీయ సంతతికి చెందిన మహిళ ప్రమీల జయపాల్ అన్నారు. ఇటీవల అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కు ఆమె ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ హౌజ్కు ఎన్నికైన తొలి భారతీయ మహిళ కూడా ఆమెనె. ఈ సందర్భంగా ఆమె తొలిసారి భారత్తో అమెరికాకు ఉండబోయే సంబంధాల విషయంలో మాట్లాడారు. తాను మహాత్మా గాంధీ జన్మించిన నేలలో జన్మించానని, భారత్కు తనకు విడదీయరాని సంబంధం ఉందన్నారు.

భారత్కు పేదరికం నుంచి క్లీన్ ఎనర్జీ వరకు అన్ని రకాలుగా అమెరికా మద్దతు ఉంటుందని అన్నారు. 'నేను భారత్ లోనే జన్మించాను. నాకు భారత్ కు చాలా గాఢ సంబంధం ఉంది. మా అమ్మనాన్నలు అక్కడే ఉన్నారు. బెంగళూరులో ఉంటారు. నా కుమారుడు అక్కడే జన్మించాడు. భారత్ కు అమెరికాకు మధ్య ఉంది కేవలం రాజకీయ సంబంధమే కాదు.. చాలా వ్యక్తిగత సంబంధం కూడా' అని ఆమె అన్నారు. చెన్నైలో జన్మించిన ప్రమీల ఐదేళ్లప్పుడే ఇండోనేషియాకు వెళ్లారు. అక్కడి నుంచి సింగపూర్ ఆ తర్వాత పదహారేళ్లకు అమెరికాకు వచ్చారు. ప్స్తుతం ఆమె వాషింగ్టన్ డీసీలో ఉంటున్నారు.

మరిన్ని వార్తలు