ప్రయాణీకుల వ్యక్తిగత డేటా కోరిన జపాన్..!

7 Sep, 2016 11:57 IST|Sakshi

దేశ వ్యతిరేక తీవ్రవాద భద్రతా ప్రణాళికను బలోపేతం చేసేందుకు జపాన్ అడుగులు వేస్తోంది. 2020 లో టోక్యో లో జరిగే ఒలింపిక్ క్రీడల నాటికి దేశంలో ఉగ్రచర్యలపై ఉక్కుపాదం మోపేందుకు కసరత్తు చేస్తోంది.  ఇందులో భాగంగా విమాన ప్రయాణీకుల వ్యక్తిగత డేటాను పంచుకోవాల్సిందిగా యూరోపియన్ యూనియన్ ను కోరింది. ప్రతిఫలంగా జపాన్ నుంచి ఈయూకు ప్రయాణించే పౌరుల వ్యక్తిగత డేటాను కూడా తాము ఈయూకు సమర్పిస్తామని జపాన్ వెల్లడించింది.

ఉగ్ర కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్న జపాన్.. విమాన ప్రయాణీకుల వ్యక్తిగత డేటాపై దృష్టి సారించింది. జాతీయ అధికారులు.. విమానయాన సంస్థలు ప్రయాణీకుల పేర్లు, పాస్పోర్ట్ నెంబర్లు, జాతీయ గుర్తింపు పత్రాలతోపాటు.. జాతీయ గుర్తింపు పత్రాలు, బ్యాంకింగ్ వంటి ఇతర సమాచారంతో సహా వ్యక్తిగత సమాచారాన్ని కలిగి ఉంటాయి. ఈ డేటాతో ఇమిగ్రేషన్ కంట్రోల్ పాయింట్లవద్ద ప్రత్యేక తనిఖీలు చేపట్టడంతో అనుమానాస్పద వ్యక్తుల ప్రవేశాన్ని నిరోధించవచ్చని జపాన్ అభిప్రాయపడుతోంది.

ఉగ్రవాద సంస్థలతో లింకులున్నట్లుగా అనుమానిస్తున్నకొందరి బ్లాక్ లిస్టును తమ ఇంటిలిజెన్స్ సర్వీస్ తయారు చేసిందని.. ప్రయాణీకుల వ్యక్తిగత వివరాలను ఇరు పక్షాలూ పంచుకోవడంవల్ల ఎంతో  ఉపయోగంగా ఉంటుందని జపాన్ తెలిపింది.  అయితే గోప్యతా, రక్షణ పాలసీలను కఠినంగా పాటించే యూరోపియన్ యూనియన్ మాత్రం.. విమానయాన సంస్థలతోపాటు, ఇతర సంస్థలకు తమ ప్రయాణీకుల వ్యక్తిగత డేటా బదిలీలను నిషేధిస్తోంది. కేవలం తమ గోప్యతా, రక్షణ ప్రామాణాలకు అనుగుణంగా మాత్రమే ప్రయాణీకుల వ్యక్తిగత డేటా ఇచ్చేందుకు అనుమతిస్తుంది.

>
మరిన్ని వార్తలు