కరాచీ విమానాశ్రయంపై మళ్లీ దాడి

10 Jun, 2014 14:38 IST|Sakshi
కరాచీ విమానాశ్రయంపై మళ్లీ దాడి
ఆది, సోమవారాల్లో ఉగ్రవాద దాడితో కకావికలమైన కరాచీ ఎయిర్ పోర్ట్ మంగళవారం మళ్ళీ దాడికి గురైంది. అయిదు నుంచి పది మంది ఉగ్రవాదులు విమానాశ్రయంలోని ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ ఫోర్సు కార్యాలయంపై రెండు వైపుల నుంచి ఒకే సారి దాడి చేశారు. భద్రతా సిబ్బంది ఉగ్రవాదులపై కాల్పులు జరుపుతున్నారు. దీంతో మరొక్క సారి కరాచీ ఎయిర్ పోర్టు కదనరంగంగా మారింది.
 
ఆదివారం రాత్రి ఉగ్రవాదులు సిబ్బంది వేషాలతో ఎయిర్ పోర్టులోకి చొరబడి చేసిన దాడిలో 36 మంది చనిపోయారు. మంగళవారం ఉదయం సహాయ సిబ్బంది కార్గో విభాగం కోల్డ్ స్టోరేజి నుంచి మరో ఏడు శవాలను వెలికితీయడంతో మృతుల సంఖ్య పెరిగింది. 
 
చనిపోయిన వారిలో 10 మంది ఉగ్రవాదులు, మరో 10 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. మిగతావారంతా మామూలు పౌరులే. అయితే కరాచీ విమానాశ్రయ సిబ్బంది సాయం లేకుండా ఈ దాడి జరగడం అసాధ్యమని భద్రతా దళాలు భావిస్తున్నాయి. 
 
 
>
మరిన్ని వార్తలు