44 టోల్ప్లాజాలకు త్వరలో మంగళం!!

10 Jun, 2014 13:41 IST|Sakshi
44 టోల్ప్లాజాలకు త్వరలో మంగళం!!

రోడ్డెక్కితే చాలు.. తోలు తీసే స్థాయిలో ఉన్న చాలావరకు టోల్ ప్లాజాలకు త్వరలోనే కాలం చెల్లిపోతోంది. మహారాష్ట్రలో అడ్డదిడ్డంగా ఏర్పాటు చేసిన 44 టోల్ప్లాజాలను మూసేయాలని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రకటించారు. అయితే.. ముంబై నగరం పరిధిలొని టోల్ప్లాజాలు మాత్రం ఈ జాబితాలో లేవు.

రోడ్డు నిర్మాణానికి అయిన వ్యయం చాలావరకు వెనక్కి వచ్చేసి, కొద్దిమాత్రం మిగిలిన టోల్ప్లాజాలను ముందుగా మూసేయాలని నిర్ణయించుకున్నట్లు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చెప్పారు. లోక్సభ ఎన్నికలకు ముందే ఈ పని చేయాలనుకున్నామని ఆయన అన్నారు. డెవలపర్లతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇప్పుడు మూసేస్తున్న 44 టోల్ప్లాజాలకు సంబంధించి రూ. 309 కోట్లను వారికి చెల్లించాల్సి వస్తుందని తెలిపారు.

>
మరిన్ని వార్తలు