లెగ్గింగ్ లు 'ఖతర్'నాక్

3 Jun, 2014 19:42 IST|Sakshi
లెగ్గింగ్ లు 'ఖతర్'నాక్
లెగ్గింగ్ లెగ్గింగే. లెగ్గింగ్ ప్యాంట్ కాదంటే కాదు. మా దేశంలో లెగ్గింగ్ లు వేసుకోకూడదు అంటోంది గల్ఫ్ దేశం ఖతర్. 2022 లో ఖతర్ రాజధాని దోహాలు ప్రపంచ కప్ ఫుట్ బాల్ పోటీలు జరగబోతున్న నేపథ్యంలో ఇస్లామిక్ దేశం ఖతర్ లో ఎలాంటి దుస్తులు ధరించాలో చెబుతూ అక్కడి అధికారులు ఒక పెద్ద ప్రచార ఉద్యమం ప్రారంభించారు.
 
చెడ్డీలు, బికినీలు, నడుము, కాళ్లను ఇష్టారాజ్యంగా చూపించడం, లెగ్గింగ్ ల వంటి బిగుతైన దుస్తులను ధరించవద్దన్నదే ఆ ప్రచారోద్యమ సారాంశం. ముఖ్యంగా ప్రపంచ కప్ ఫుట్ బాల్ కి వచ్చే విదేశీ ప్రయాణికులకు ఈ హెచ్చరికలు చేస్తున్నారు. 'నడిరోడ్డులోనే ముద్దులు పెట్టుకోవడాలు, కౌగిలించుకోవడాలు, స్లీవ్ లెస్ లు, మినీస్కర్టులు మా దేశంలో చెల్లవు గాక చెల్లవు'అంటున్నారు ఖతర్ అధికారులు.
 
మొత్తం శరీరం కప్పుకుని ఉండటమే మాకు మర్యాద అంటున్నారు. రోమ్ లో ఉంటే రోమన్ల లా ఉండాలి. అలాగే ఖతర్ లో ఉంటే ఖతర్ లా ఉండాలి తప్ప 'ఖతర్నాక్' గా ఉండొద్దు అంటున్నారు ఖతర్ అధికారులు. 
 
మరిన్ని వార్తలు