భూమిపై ఏంటా వెలుగు..?

24 May, 2018 09:45 IST|Sakshi
అంతరిక్షం నుంచి భూమిపై కనిపిస్తున్న మెరుపులు

వాషింగ్టన్‌ : ఈ ఫొటోలోని వెలుగులను చూశారా?. అర్థరాత్రి అంతరిక్షం నుంచి చిత్రీకరించిన ప్రపంచ వెలుగు జిలుగులు కావవి. ప్రకృతి ప్రకోపానికి నిదర్శనాలు. ఉత్తర, దక్షిణ అమెరికాల్లో సంభవించిన భారీ మెరుపులకు సంబంధించిన వెలుగు అది. ఇందుకు సంబంధించిన ఫుటేజిని జాతీయ సముద్ర, వాతావరణ పరిపాలక సంస్థ(ఎన్‌ఓఏఏ) విడుదల చేసింది.

జీవోఈఎస్‌-17 ఉపగ్రహం ద్వారా ఈ వీడియోను రికార్డు చేసినట్లు ఎన్‌ఓఏఏ వెల్లడించింది. ఈ నెల 9న ఈ వీడియోను ఉపగ్రహం రికార్డు చేసినట్లు పేర్కొంది.

మరిన్ని వార్తలు