‘దీని కోసం ఏడేళ్లు ఎదురు చూశా!’

14 Jan, 2020 19:02 IST|Sakshi

దుబాయ్‌: ప్రపంచంలోనే అతి ఎత్తైన బిల్డింగ్‌ యునైటెడ్‌ స్టేట్‌ ఎమిరెట్సలోని ‘బుర్జ్‌ ఖలిఫా’. దాదాపు 2,720 అడుగులతో ఆకాశాన్ని తాకేలా కనింపించే బుర్జ్‌ ఖలీఫా ప్రపంచ అద్భుత కట్టడాల్లో ఒకటి. ఇంతటి అందమైన అద్దాల మేడ చూడటానికి వివిధ దేశాల నుంచి పర్యాటకులు క్యూ కడతారు. ఈ కట్టడాన్ని రాత్రి వేళ ఆకాశంలో మెరిసే మెరుపు వచ్చి తాకితే ఆ దృశ్యం ఎంత అందంగా ఉంటుందో ఓ సారి ఊహించుకోండి. ఊహించుకుంటుంటూనే అంత అందంగా అనిపిస్తే.. మరి నిజంగానే మెరుపు వచ్చి తాకిన దృశ్యం మీకు కనబడితే.. ఎలా ఉంటుందో చూస్తారా. అయితే దుబాయ్‌లోని ఓ ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ శుక్రవారం షేర్‌ చేసిన అత్యంత అరుదైన వీడియోను చూసేయండి. 


ఈ అత్యంత అందమైన దృశ్యాన్ని కెమారాలో బంధించిన ఫొటోగ్రాఫర్‌ పేరు జోహైబ్ అంజుమ్. దీన్ని తన కెమోరాల్లో బంధించించడానికి దాదాపు 7 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్న అంజుమ్‌ చివరకు 2020లో తన కలను నిజం చేసుకున్నాడు. ఈ సందర్భంగా అంజుమ్‌ మాట్లాడతూ.. ‘ఈ అరుదైన దృశ్యాన్ని తన కెమెరాలో బంధించడానికి ఏడు సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నాను. ఇందుకోసం ఎడారి దేశంలో వర్షం పడినపుడల్లా ‘బుర్జ్‌ ఖలిఫా’ బయట ఎన్నో రాత్రిళ్లు మెళకువతో గడిపాను. ఈ క్రమంలో గత శుక్రవారం దుబాయ్‌లో వర్షం పడటంతో యథావిధిగా అక్కడికి వెళ్లాను. ఇక దేవుడు నా కష్టాన్ని గుర్తించి ఈ ఏడాది నా కల సాకారం చేశాడు’ అని చెప్పుకొచ్చాడు.

మరిన్ని వార్తలు