తినే మ్యాగీ కాళ్ల కింద; నలిగిపోయిందా?

19 Dec, 2019 20:16 IST|Sakshi

రెండు నిమిషాల్లో స్నాక్స్‌ సిద్ధం కావాలంటే మ్యాగీ ఉండాల్సిందే. నోరూరించే మ్యాగీ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్లదాకా అందరికీ ఇష్టమే. తాజాగా మ్యాగీ వార్తల్లోకెక్కింది. ఏంటి? మ్యాగీలో మళ్లీ ఏదైనా కెమికల్స్‌ కలుపుతున్నారా అని ఆందోళన చెందకండి. అదేమీ లేదు, ప్రముఖ ఫ్యాషన్‌ కంపెనీ కొత్త సంవత్సరం కలెక్షన్స్‌ అంటూ.. నూడిల్స్‌తో పాటు ఓ ఫొటోను పోస్ట్‌ చేసింది. అదే దీనంతటికీ కారణమైంది. ఇక ఈ ఫొటోలో ఓ యువతి మ్యాగీ చెప్పులను ధరించింది. దాని పక్కన మ్యాగీ ఫొటో కూడా ఉండటంతో అది మ్యాగీతో చేసిందేనని అందరూ భావించారు.

‘తినే మ్యాగీ కాళ్లకింద నలిగిపోయిందే..’ అని తెగ ఫీలయ్యారు. కానీ అసలు విషయం తెలిశాక నవ్వకుండా ఉండలేకపోయారు. ఆ యువతి ధరించిన చెప్పులు మ్యాగీ డిజైన్‌ను పోలి ఉన్నాయి తప్పితే మ్యాగీతో తయారు చేసినవి కాదు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు బాగుందంటూ నవ్వుకుంటుంటే. ఏడ్చినట్టు ఉంది నీ బ్రాండ్‌ అని తిట్టిపోస్తున్నారు. ‘వేడినీళ్లు తగిలితే చెప్పులు దెబ్బతినవు కదా? అని కొందరు చమత్కార కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ చెప్పులు సొంతం చేసుకోవాలంటే సుమారు రూ.లక్ష వెచ్చించాల్సిందే.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా