యాంకర్‌గా మరో పోర్న్‌స్టార్‌

16 Oct, 2017 14:34 IST|Sakshi

సాక్షి: సన్నీలియోన్‌ తరహాలోనే మరో పోర్న్‌స్టార్‌ బుల్లితెరపై కనిపించే ఏర్పాట్లు జరుతున్నాయి. సన్నీలియోన్‌ గత జీవితాన్ని విడిచిపెట్టి బాలీవుడ్‌లో నటిస్తున్న తరహాలనే మరో పోర్న్‌స్టార్‌ మియా ఖలీఫా కూడా త్వరలోనే ఓ టాక్‌షోకు వ్యాఖ్యాతగా కనిపించబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు అభిమానులు పెద్ద ఎత్తున ఉన్నారు. 2016లో గూగుల్లో అందరికంటే ఎక్కువగా మియా ఖలీఫా గురించే వెతికారు. ప్రస్తుతం ఖలీఫా పోర్న్ సినిమాల్లో నటించడం మానేసింది. గతంలో ఒక ముస్లిం అయి పోర్న్ సినిమాల్లో నటిస్తావా అంటూ ఉగ్రవాద సంస్థల నుండి వార్నింగ్‌లు రావడంతో క్రైస్తవాన్ని స్వీకరించి అమెరికాలో స్థిరపడ్డారు

మియాకు బేస్ బాల్, అమెరికన్ ఫుట్ బాల్ అంటే ఇష్టం. ఆమెకు ఉన్న క్రేజ్‌ను చూసి 'కాంప్లెక్స్ న్యూస్' అనే యుట్యూబ్ ఛానల్లో వ్యాఖ్యాతగా అవకాశం వచ్చింది. గిల్బెర్ట్‌ అరేనా అనే బాస్కెట్ బాల్ ప్లేయర్ తో కలసి ఇప్పుడు 'ఔట్ ఆఫ్ బౌండ్స్' అనే టాక్ షో వ్యాఖ్యాతగా వ్యవహరించనుంది. భారత కాలమానం ప్రకారం రేపు మధ్యాహ్నం ఈ షో ప్రసారం కానుంది.

మరిన్ని వార్తలు