ట్రంప్‌ కోసం బంగారపు టాయిలెట్‌

26 Jan, 2018 16:01 IST|Sakshi

న్యూయార్క్ లోని గుగ్గెన్హైమ్ మ్యూజియంకు భలే గోల్డెన్‌ ఐడియా వచ్చింది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఏకంగా గోల్డెన్‌ టాయిలెట్‌నే బహుకరిస్తోంది. ట్రంప్‌కు అసలెందుకు ఈ గోల్డెన్‌ టాయిలెట్‌ను పంపిస్తోందో తెలుసా? అధ్యక్షుడు, తొలి మహిళ తాము నివసించే ప్రైవేట్‌ గదిలో 19వ శతాబ్దపు విన్సెంట్ వాన్ గోగ్ అనే పేయింటర్‌ చిత్రీకరించిన  ''ల్యాండ్‌స్కేప్‌ విత్‌ స్నో'' పేయింటింగ్‌ను పెట్టుకోవాలని ఆశించారు. వారి ఆశ మేరకు ఆ పేయింటింగ్‌ను త్వరగా పంపించాలంటూ వైట్‌హౌజ్‌ మ్యూజియాన్ని ఆదేశించింది. అయితే ఆ పేయింటింగ్‌ ఇవ్వడం ఇష్టంలేని మ్యూజియం అధికారులు దాని బదులు గోల్డెన్‌ టాయిలెట్‌ను ట్రంప్‌కు బహుకరిస్తున్నారని వాషింగ్టన్‌ పోస్టు రిపోర్టు చేసింది. 

మ్యూజియం చీఫ్‌ క్యూరేటర్‌ ఈ టాయిలెట్‌ను అందిస్తున్నారని, ఇప్పటి వరకు ఈ టాయిలెట్‌ను వేలాది మంది సందర్శకులు వాడారని తెలిసింది. దీనిపై గుగ్గెన్హైమ్ మ్యూజియం అధికార ప్రతినిధి కానీ వైట్‌హౌజ్‌ అధికారులు కానీ స్పందించడానికి నిరాకరించారు. అయితే ఆర్థిక అసమానతలను రూపుమాపడమే ఇతివృత్తంగా మారాజియో కాటలెన్‌ అనే కళాకారుడు 18 క్యారెంట్లతో ఈ టాయిలెట్‌ను రూపొందించారు.  విలాసవంతమైన రూపం ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతోనే దీన్నిమ్యూజియం లోని యూనిసెక్స్ బాత్రూంలో 2016లో ఏర్పాటు చేశారు. 100,000 మందికి పైగా ఈ టాయిలెట్‌ను వాడినట్టు గుగ్గెన్హైమ్ మ్యూజియం బ్లాగ్‌ పోస్టు పేర్కొంది. 

మరిన్ని వార్తలు