ఆత్మలే.. కారు నడిపాయా?!

19 Oct, 2017 18:32 IST|Sakshi

సింగపూర్ సిటీ : ఆత్మలు.. దయ్యాల గురించి ప్రపంచమంతా విస్తృత ప్రచారం ఉంది. కొందరు ఉన్నాయని.. మరికొందరు లేవని ఇలా ఎవరికి వారు తమతమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. వీటి సంగతి ఎలా ఉన్నా కొన్ని సంఘటనలను చూసినప్పుడు ఆత్మలు.. దయ్యాలు ఉన్నాయని సమ్మాల్సిందేనని మరికొందరు చెబుతున్నారు. ఇందుకు సింగపూర్‌లో జరిగిన ఒక ఘటనే నిదర్శనమని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఆత్మల గురించి చెప్పే ఆ ఘటన గురించి తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సందే.

సింగపూర్‌ సిటీలోని ఒక ట్రాఫిక్‌ సిగ్నల్‌. సిగ్నల్‌ పడడంతో అన్ని వాహనాలు ఆగిపోయాయి. తరువాత నెమ్మదిగా వాహనాలు.. అటూ, ఇటూ ముందుకు వెళుతున్నాయి. ట్రాఫిక్‌ను గమినిస్తూ.. ఒక వ్యక్తి సిగ్నల్‌ దాటుతున్నారు. ఎదురుగా ఏ వాహనం లేకపోయినా.. జాగ్రత్తగా కారును రోడ్డు దాటించేందుకు ప్రయత్నిస్తున్నారు.

కొన్ని సెకన్లలో కారు రోడ్డును దాటేస్తుంది అనుకునే సమమయంలో అప్పటివరకూ అక్కడెక్కడా లేని ఒక కారు హఠాత్తుగా  మొదటి కారుకు అడ్డుగా వచ్చింది. దీంతో రెండే కార్లు ఢీ కొట్టుకున్నాయి. ఏం జరిగిందో ఏమిటో తెలసుకునే లోపే హఠాత్తుగా వచ్చిన కారు.. కొద్దిగా ముందుకెళ్లి కనిపించకుండా పోయింది. ఈ కారు ప్రమాదం సిగ్నల్‌ దగ్గరున్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఎన్నిసార్లు రీప్లేలో చూసినా హఠాత్తుగా వచ్చిన కారు.. హఠాత్తుగా ఎలా మాయమయిందో మాత్రం ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఈ యాక్సిడెంట్‌ సిగపూర్‌లో మంగళవారం జరిగినట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజ్‌ ఘోస్ట్‌ వీడియో పేరుతో.. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

మరిన్ని వార్తలు