పేదరిక అంచనాలో వినూత్న పద్ధతులు

22 Nov, 2016 13:08 IST|Sakshi

వాషింగ్టన్‌: ఒక మనిషి ఆర్థిక స్థితి అంచనాలో ఆరోగ్యం, విద్య, జీవనప్రమాణాలు, సామాజిక ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉండవచ్చని ఓ అధ్యయనంలో తేలింది. వివిధ రకాల పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నప్పుడు దాదాపు 15 శాతం మంది అమెరికన్లను పేదల జాబితాలోకి చేర్చాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది పేదరిక అంచనాలో కొత్తదనానికి దారి తీస్తుందన్నారు. వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే గణాంకాలు మరింత కచ్చితంగా ఉంటాయన్నారు.

ఈ పరిశోధన ప్రధానంగా అమెరికాలో ఆర్థిక మాంద్యం అధికంగా ఉన్న 2008–13 మధ్యకాలంలో జరిగిందని తేలింది. పరిశోధకుల విశ్లేషణ ప్రకారం అధికారిక లెక్కల ప్రకారం పేదరికం 13.2 శాతం ఉండగా, ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు 14.9 శాతం మంది పేదరికంలో ఉన్నట్లు తేలింది. ఈ రెండు రకాల గణాంకాల్లోనూ 6.6 శాతం మంది ఉమ్మడిగా ఉన్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు