ఏటీఎంలపై భయంకరమైన బ్యాక్టీరియా

18 Nov, 2016 22:08 IST|Sakshi
ఏటీఎంలపై భయంకరమైన బ్యాక్టీరియా

న్యూయార్క్‌: ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా డబ్బుల కోసం ఏటీఎంల ముందు లైన్‌లో నిల్చొవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఏటీఎంలకుండే కీప్యాడ్‌లపై భయంకరమైన బ్యాక్టీరియా ఉందని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. చెడిపోయిన ఆహారంలో ఉండే వివిధ రకాల బ్యాక్టీరియాలు ఈ కీప్యాడ్‌పై ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. వీటివల్ల అనేకరకాల అనారోగ్య సమస్యలు తెలెత్తుతాయని హెచ్చరించారు.

గాలి, ఆహారం, వాతావరణంలోంచి ఈ భయంకర బ్యాక్టీరియా కీప్యాడ్‌లపైకి వచ్చి చేరుతున్నట్లు తమ అధ్యయనంలో తేలినట్లు న్యూయార్క్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జానే కర్ల్‌ టాన్‌ తెలిపారు. జూలై 2014లో దాదాపు 66 ఏటీఎంలపై పరిశోధనలు చేసి ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. ఇలాంటి బ్యాక్టీరియా టీవీలు, కిచెన్‌, దిండ్లలో కూడా  ఉంటాయని చెప్పారు. కుళ్లిపొయిన పాలు, మొక్కల్లో ఈ రకమైన బ్యాక్లీరియా ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు.

మరిన్ని వార్తలు