కుటుంబాల కలయికకు ‘కొరియాలు’ ఓకే

23 Jun, 2018 03:48 IST|Sakshi
కిమ్‌ జోంగ్‌ ఉన్, మూన్‌ జయే ఇన్‌

సియోల్‌: కొరియా యుద్ధం వల్ల దూరమైన కుటుంబాలు తిరిగి కలుసుకోడానికి ఉత్తర, దక్షిణ కొరియా దేశాలు అంగీకరించాయి. ఈ మేరకు ఇరు దేశాలు శుక్రవారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ‘ఇరువైపులా 100 మందిని ఎంపిక చేసి ఆగస్టు 20–26 మధ్య కలుసుకోడానికి అనుమతిస్తాం’ అని అందులో పేర్కొన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన భేటీలోనే ఉత్తర, దక్షిణ కొరియాల అధ్యక్షులు కిమ్‌ జోంగ్‌ ఉన్, మూన్‌ జయే ఇన్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎంపికైనవారు తమ బంధువులతో గడిపేందుకు 3 రోజులు సమయమివ్వనున్నారు. విడిపోయిన తమ బంధువులను కలుసుకోడానికి దక్షిణ కొరియాలో 57 వేల మంది రెడ్‌ క్రాస్‌ వద్ద దరఖాస్తు చేసుకున్నారు. 1950–53 మధ్య జరిగిన యుద్ధం వల్ల కొరియా విభజన జరిగి లక్షల్లో ప్రజలు వేరయ్యారు.

మరిన్ని వార్తలు