దిగొచ్చిన ఆక్స్‌ఫర్డ్‌..

10 Mar, 2018 17:06 IST|Sakshi
సోఫీస్మిత్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఫొటో

లండన్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ వెలగబెట్టిన నిర్వాకం వివాదంగా మారింది. సోషల్‌ మీడియాలో దుమారం రేగడంతో ఆక్స్‌ఫర్డ్‌ దిగొచ్చి క్షమాపణలు చెప్పింది. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సోఫీస్మిత్‌.. ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన మహిళ ఫొటో వివాదానికి కారణమైంది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి8) రోజున యూనివర్సిటీ మెట్లపై రాసివున్న ‘హ్యాపి ఇంటర్నేషనల్‌ ఉమెన్స్‌ డే’ నినాదాన్ని ఓ మహిళతో శుభ్రం చేయించడం, అక్కడేవున్న నలుగురు పురుషులు ఏమీ పట్టనట్టు మాట్లాడుకుంటున్నట్టు ఫొటోలో ఉంది. ఈ చిత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. యూనివర్సిటీ చర్యను తప్పుబడుతూ నెటిజన్లు మండిపడ్డారు. దీంతో ఆక్స్‌ఫర్డ్‌ క్షమాపణ చెప్పింది. ‘మీరు క్షమాపణలు చెప్పినందుకు అభినందనలు. కానీ మీరు ఆ మహిళకు హృదయపూర్వకంగా క్షమాపణలు తెలిపి, గౌరవించండి’ అంటూ ప్రొఫెసర్‌ సోఫీస్మిత్‌ ట్విటర్‌లో స్పందించారు.

  

మరిన్ని వార్తలు