మసూద్‌ ఆస్తుల ఫ్రీజ్‌

4 May, 2019 04:38 IST|Sakshi

ఇస్లామాబాద్‌: జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ చీఫ్‌ మసూద్‌ అజర్‌ ఆస్తులను స్తంభింపజేయడంతోపాటు ఆయనపై ప్రయాణ నిషేధాన్ని పాక్‌ విధించింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస ప్రకటించడంతో పాక్‌ ఈ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌కు చెందిన మసూద్‌ ఇకపై ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కొనడం, అమ్మడం వంటివి చేయడానికి వీలు లేదు. సెక్యూరిటీ అండ్‌ ఎక్స్‌చేంజ్‌ కమిషన్‌ ఆఫ్‌ పాకిస్తాన్‌ (ఎస్‌ఈసీపీ) గురువారం పాకిస్తాన్‌లోని అన్ని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ఆదేశాలిస్తూ, మసూద్‌కు చెందిన అన్ని పెట్టుబడుల ఖాతాలను స్తంభింపజేయాలంది.  పోలీసుల అనుమతి లేకుండా మసూద్‌ ఎక్కడికీ ప్రయాణిచడానికి కూడా వీలు లేదని పాక్‌ హోం శాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు. కాగా, పుల్వామా ఉగ్రవాద దాడ అనంతరమే మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని విశ్వసనీయవర్గాలు చెప్పాయి.

మరిన్ని వార్తలు