పెరిగిన హెచ్‌ఐవీ పేషెంట్లు.. డాక్టర్‌ అరెస్ట్‌

3 May, 2019 17:27 IST|Sakshi

కరాచీ : పాకిస్తాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌లో హెచ్‌ఐవీ వ్యాధిని వ్యాప్తి చేస్తున్న డా. ముజఫర్‌ గంగర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. లర్కానా జిల్లాలోని రటోడెరోలో ప్రభుత్వ ఆసుపత్రిలో ముజఫర్‌ గంగర్‌ విధులు నిర్వహిస్తున్నారు. అతడికి కూడా హెచ్‌ఐవీ ఉన్నట్టు గుర్తించారు. లర్కానా నగర సమీప ప్రాంతాల్లో హెచ్‌ఐవీ బాధితుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో వైద్యఅధికారులు అలర్ట్‌ను ప్రకటించారు. వైద్య పరీక్షలకు ఆదేశించగా చిన్నపిల్లలు కూడా ఎక్కువగా హెచ్‌ఐవీ భారిన పడ్డట్లుగా గుర్తించారు. విచారణ సందర్భంగా ఓ వైద్యుడి వద్ద చికిత్స తీసుకున్న వారంతా ఈ వైరస్‌ బారిన పడ్డట్లు అధికారులు గుర్తించారు. సదరు వైద్యుడు కలుషిత సిరంజీలు వాడటం వల్లే వ్యాధి వ్యాప్తికి కారకుడయ్యాడని పేర్కొన్నారు. కలుషిత సిరంజి వాడటం వల్ల 90 మంది వ్యక్తులు హెచ్‌ఐవీ బారిన పడినట్టు తెలుస్తోంది. వీరిలో 65 మంది పిల్లలు ఉన్నారు.

అయితే ఈ ఘటనకకు తనకు ఎలాంటి సంబంధం లేదని డా. ముజఫర్‌ గంగర్‌ తెలిపారు. తనకు హెచ్‌ఐవీ సోకిన విషయం కూడా తెలియదని చెప్పారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయనున్నట్టు సింధ్‌లో ఎయిడ్స్‌ కంట్రోల్‌ ప్రోగ్రామ్‌ ఇంచార్జ్‌ డా. సికందర్‌ మెమన్‌ తెలిపారు.

>
మరిన్ని వార్తలు