పందుల నుంచి పెనుప్రమాదం

16 May, 2018 10:07 IST|Sakshi
పందులు

వాషింగ్టన్‌ : పందుల నుంచి సరికొత్త వైరస్‌ మానవాళికి సోకే పెనుప్రమాదం పొంచి ఉంది. పొర్సిన్‌ డెల్టాకొరోనా అనే భయంకర వైరస్‌ కారణంగా పందులకు విరేచనాలు, వాంతులు ఎక్కువగా అయి మరణిస్తాయి. సార్స్‌ వ్యాధి లక్షణాలను ఎక్కువగా కలిగి ఉన్న పొర్సిన్‌ వైరస్‌ మనషులకు సోకే అవకాశం ఉన్నట్లు జర్నల్‌ ఆఫ్‌ ప్రొసీడింగ్స్‌లో నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఓ కథనాన్ని ప్రచురించింది.

పొర్సిన్‌ వైరస్‌ను తొలిసారిగా 2012లో చైనాలో కనుగొన్నారు. 2014లో అమెరికాలో కూడా ఈ వ్యాధి కనిపించడంతో భయాందోళనలు మొదలయ్యాయి. తాజాగా పరిశోధకుల అధ్యాయనంలో పొర్సిన్‌ వ్యాధి కోళ్లు, పిల్లులు, మనుషుల కూడా సోకుతుందని, ఈ వ్యాధి బారిన పడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సివస్తుందని తేలింది.

మరిన్ని వార్తలు