ఫేస్ బుక్ వదిలేస్తే కొండంత సంతోషం!

12 Nov, 2015 08:43 IST|Sakshi
ఫేస్ బుక్ వదిలేస్తే కొండంత సంతోషం!

న్యూయార్క్: ఇప్పుడు సంతోషం ఎక్కడుందంటే సామాజిక మాధ్యమాల్లో అని చెప్పుకునే రోజులు వచ్చాయి. ఆటపాట, మాటాముచ్చట అన్నీ మర్చిపోయి అందుబాటులో మొబైల్తోనో, ఆఫీస్ లో ఉంటే కంప్యూటర్లతోనే వెంటనే ఫేస్ బుక్, ట్విట్టర్, చాటర్ బాక్సెస్ వంటి ఎన్నో సోషల్ వెబ్ సైట్లలోకి దూరేస్తుంటారు. ఇక ఫేస్ బుక్ మాత్రం దిన చర్యగా మారింది. అయితే, ఎంత దినచర్యగా మారినా అది వ్యసనంగా ఉన్నా, ఒక్కసారి ఫేస్ బుక్ ను వదిలేసి బయటకు వస్తే ఆ వచ్చిన వ్యక్తులు ఎంతో సంతోషంగా ఉంటారని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది.

కొత్తగా ఫేస్ బుక్ ఉపయోగిస్తున్నవారిని, అప్పటికే ఫేస్ బుక్ వదిలేసిన వారిని ప్రశ్నించగా.. వారి రియాక్షన్ అధ్యయనకారులను ఆశ్చర్యపరిచాయి. డెన్మార్క్ లో చేసిన ఈ అధ్యయనంలో మొత్తం 1095మందిని తీసుకొని రెండు గ్రూపులుగా చేసి వారిని ప్రశ్నించగా 88శాతంమంది తాము ఫేస్ బుక్ వదిసేశాకే సంతోషంగా ఉన్నామని చెప్పారు. 81శాతంమంది మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టమున్నా లేకపోయినా ఫేస్ బుక్ను ప్రతి రోజు తనిఖీ చేసుకుంటున్నామని తెలిపారు.

మరికొందరు మాత్రం ఫేస్ బుక్లో గడపడం చాలా ఆహ్లాదంగా ఉంటుందని, ఒంటరిగా ఉన్నామనే భావన అస్సలు తెలియదని చాలా తక్కువ మాత్రమే బాధపడిన సందర్భాలున్నాయని చెప్పారు. ఎక్కువమంది మాత్రం ఫేస్ బుక్ వదిలేసిన తర్వాతనే కాస్త ఎక్కువ ఆనందంగా ఉన్నామని తెలిపారు. ఈ విషయంలో అధ్యయనకారులు ఫేస్ బుక్ ప్రతినిధులను ప్రశ్నించగా వాస్తవానికి అందులో ఖాతా తెరిచినవారు తమకు ఏం కావాలో అనే విషయంపై స్పష్టత లేకుండానే గడిపి అనవసర ఒత్తిడికి లోనవుతుంటారని, ఇబ్బంది కలిగించేటటువంటి విషయాలేవీ అందులో ఉండవని అన్నారు.

మరిన్ని వార్తలు