'పాక్ లో మ్యాచ్ ఆడేందుకు సచిన్ ఓకే'

12 Nov, 2015 11:24 IST|Sakshi
'పాక్ లో మ్యాచ్ ఆడేందుకు సచిన్ ఓకే'

కరాచీ: పాకిస్థాన్ లో క్రికెట్ ఆడేందుకు టీమిండియా జంకుతుంటే మాస్టర్ బ్లాస్టర్ మాత్రం పొరుగుదేశంలో మ్యాచ్ ఆడేందుకు సై అంటున్నాడు. ఆల్ స్టార్ టి20 మ్యాచ్ ను పాకిస్థాన్ లో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాడు. తమ దేశంలో మ్యాచ్ నిర్వహించాలని సచిన్ ను పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కోరారు. తన ప్రతిపాదనకు సచిన్ సంతోషంగా అంగీకరించాడని, ఇది కార్యరూపం దాల్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడని అక్తర్ వెల్లడించాడు.

మాజీ క్రికెటర్లతో సచిన్, షేన్ వార్న్ ఆల్ స్టార్ టి20 నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి మ్యాచ్ న్యూయార్క్ లో నిర్వహించారు. రెండో మ్యాచ్ గురువారం హూస్టన్ లో జరుగుతోంది. అక్తర్ తో పాటు వసీం అక్రమ్, సక్లెయిన్ ముస్తక్, మెయిన్ ఖాన్ కూడా ఆల్ స్టార్ సిరీస్ లో ఆడుతున్నారు. భారత క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, అజిత్ అగార్కర్ కూడా ఇందులో ఉన్నారు.

మరిన్ని వార్తలు