భారతీయ అమెరికన్‌కు 10 ఏళ్లు జైలు

22 Jul, 2017 02:13 IST|Sakshi

వాషింగ్టన్‌: షేర్‌ హోల్డర్లను రూ.315కోట్ల మేర మోసం చేసిన కేసులో శ్రీధర్‌ పోతరాజు అనే భారతీయ అమెరికన్‌ డాక్టర్‌కు 10ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ అలెగ్జాండ్రియా ఫెడరల్‌ కోర్టు తీర్పు వెలువరించింది. అమెరికాలోని మేరీ ల్యాండ్, వర్జీనియాలో శ్రీధర్‌ కళ్ల సర్జన్‌గా వృత్తి జీవితం ప్రారంభించారు. 1999లో ఆయన వైటల్‌స్ప్రీంగ్‌ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ప్రారంభించారు. 2008 ఆర్థిక మాంద్యం నేపథ్యంలో లాభాలను అధికంగా చూపి 174మంది ఇన్వెస్టర్ల నుంచి రూ. 315 కోట్లు సేకరించాడు. కంపెనీ ఎంప్లాయిమెంట్‌ ట్యాక్స్‌ చెల్లించలేదని ఐఆర్‌ఎస్‌ ప్రకటించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మరిన్ని వార్తలు