యూరప్లో టెర్రరిస్టుల అరెస్టు పర్వం

25 Mar, 2016 20:32 IST|Sakshi
యూరప్లో టెర్రరిస్టుల అరెస్టు పర్వం

బ్రస్సెల్స్: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో బాంబు పేలుళ్ల అనంతరం యూరప్ అంతటా అరెస్టుల పర్వం మొదలైంది. ఇప్పటికే ఉగ్రవాదులతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్న అనుమానితులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో ఇసుమంత సంబంధమున్నా వారిని నిర్భందిస్తున్నారు.

ఈ మంగళవారం బ్రస్సెల్స్లోని ఎయిర్ పోర్ట్ పై బాంబు దాడులకు పాల్పడి ఇద్దరు అమెరికన్లతో సహా 31మందిని బలితీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించే ఇప్పటికే బ్రస్సెల్స్ లో ఏడుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఎయిర్ పోర్ట్ లో ఇద్దరు ఆత్మహుతి దళ సభ్యుల వెనుక లగేజ్ నెట్టుకుంటూ వచ్చిన వ్యక్తి కూడా ఉన్నట్లు సమాచారం. దీంతోపాటు నెయిబ్ అల్ హమీద్ అనే మరో వ్యక్తికి, రీదీ క్రికెట్ అనే వ్యక్తి కోసం వాంటెడ్ నోటీసులు కూడా జారీ చేశారు. అలాగే, ఫ్రాన్స్, బ్రిటన్, బెల్జియం అంతటా అనుమానిత ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు