ఒకే అట్టలో రెండు పుస్తకాలు..

12 Nov, 2017 01:29 IST|Sakshi

పుస్తకం కావాలంటే ఏం చేస్తారు.. బుక్‌ స్టోర్‌కు వెళ్లి కొనుక్కుంటారు. లేదం టే ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తారు. మరీ కాదంటే నెట్‌లో పీడీఎఫ్‌ ఫైల్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని చదివేస్తారు. అయితే మధ్యయుగంలో ఇలాంటి వసతులు చాలా చాలా తక్కువ. పుస్తకం కావాలంటే ఎన్ని కష్టాలు పడాలో.. పైగా అప్పట్లో ప్రింటింగ్‌ ప్రెస్‌లు కూడా ఏ ఒకటో రెండో ఉండేవి.

బుక్‌ బైండర్స్‌ కూడా రెండు మూడు పుస్తకాలను ఒకే పుస్తకంగా కలిపి కుట్టేవారు. దీంతో పాఠకులకు రెండు పుస్తకాలు మోసుకెళ్తున్నామనే బాధ ఉండకుండా ఉంటుందని వారు భావించేవారు. ఎక్కువగా బైబిల్‌లోని రెండు భాగాలను ఇలా ఒకే పుస్తకంగా కుట్టేవారట. 17వ శతాబ్దంలో ఇంగ్లండ్‌ లో ఇలాంటి పుస్తకాలు విరివిగా వాడేవారట. ఈ పద్ధతిని ఫ్రెంచ్‌లో ‘డోసా డోస్‌’ అనే వారట. ఇంగ్లిష్‌లో బ్యాక్‌ టు బ్యాక్‌ అని అర్థం.

మరిన్ని వార్తలు