భారత్‌లో క్రోమ్‌బుక్‌ల తయారీ షురూ | Sakshi
Sakshi News home page

భారత్‌లో క్రోమ్‌బుక్‌ల తయారీ షురూ

Published Tue, Oct 3 2023 4:41 AM

Google, HP start manufacturing Chromebooks in India - Sakshi

న్యూఢిల్లీ: టెక్‌ దిగ్గజం గూగుల్, పీసీల తయారీ సంస్థ హెచ్‌పీ కలిసి భారత్‌లో క్రోమ్‌బుక్స్‌ ఉత్పత్తిని ప్రారంభించాయి. భారత్‌లో తొలిసారిగా తయారుచేస్తున్న క్రోమ్‌బుక్స్‌తో దేశీ విద్యార్థులకు చౌకగా, సురక్షితమైన విధంగా కంప్యూటింగ్‌ అందుబాటులోకి రాగలదని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఎక్స్‌లో (గతంలో ట్విట్టర్‌) పోస్ట్‌ చేశారు. చెన్నైకి దగ్గర్లోని ఫ్లెక్స్‌ ఫెసిలిటీలో హెచ్‌పీ వీటిని తయారు చేస్తోంది.

కొత్త క్రోమ్‌బుక్స్‌ ఆన్‌లైన్‌లో రూ. 15,990 నుంచి లభిస్తాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2020 నుంచి హెచ్‌పీ భారత్‌లో తమ తయారీ కార్యకలాపాలను గణనీయంగా విస్తరిస్తోంది. ఎలీట్‌బుక్స్, ప్రోబుక్స్, జీ8 సిరీస్‌ నోట్‌బుక్స్‌ వంటి వివిధ ల్యాప్‌టాప్‌లు, ఆల్‌–ఇన్‌–వన్‌ పీసీలు, డెస్క్‌టాప్‌లు మొదలైన వాటిని దేశీయంగా తయారు చేస్తోంది. భారత్‌లో ఐటీ హార్డ్‌వేర్‌ తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ. 17,000 కోట్ల ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకానికి కూడా దరఖాస్తు చేసుకుంది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement