‘అమెరికన్లు మీరిక జాగ్రత్త.. ముఖ్యంగా పాక్‌తో..’

7 Mar, 2017 10:30 IST|Sakshi
‘అమెరికన్లు మీరిక జాగ్రత్త.. ముఖ్యంగా పాక్‌తో..’

వాషింగ్టన్‌: తమ దేశ పౌరులకు అమెరికా హెచ్చరికలు చేసింది. తమ పౌరులెవ్వరూ ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్‌, అఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌కు వెళ్లొద్దని, అక్కడ తిరుగుబాటు చేసే సాంఘిక వ్యతిరేక శక్తులు ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్నాయని తెలిపింది. అలాగే, ఆ దేశాలకు చెందిన ఉగ్రవాదులు భారత్‌లో కూడా యాక్టివ్‌గా ఉన్నారంటూ తెలియజేసింది.

గతంలో ఏడు ముస్లిం దేశాలు, ఇప్పుడు ఆరు ముస్లిం దేశాలపై అమెరికా నిషేధం విధించిన నేపథ్యంలో అమెరికా పౌరులపై, అమెరికాకు చెందిన స్థావరాలపై, అమెరికా శ్రద్ధ కనిబరిచే అంశాలపై దక్షిణ ఆసియాలోని ఉగ్రవాదులు, తిరుగుబాటు సంస్థలు దాడులు చేసే ప్రమాదం ఉందని తమకు సమాచారం అందిన నేపథ్యంలో పైన పేర్కొన్న దేశాల్లో ప్రస్తుతం పర్యటించే ఆలోచనను విరమించుకోవాలని స్పష్టం చేసింది.

అయితే, ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్న తమ పౌరులను హెచ్చరిస్తున్నామని, ప్రత్యేకంగా ఈ మూడు దేశాల్లోని వారికి ఒక సూచన చేస్తున్నట్లుగా చెప్పింది. పాకిస్థాన్‌లో అమెరికా పౌరులకు తీవ్ర వ్యతిరేకంగా పరిస్థితులు ఉన్నాయని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.  

 

>
మరిన్ని వార్తలు