మంట కలిసిన మానవత్వం

4 Mar, 2018 17:13 IST|Sakshi

సాక్షి, బెంగుళూరు : కర్ణాటకలో హృదయ విదారక సంఘటన జరిగింది. ప్రమాదంలో తండ్రి మరణిస్తే మృతదేహాన్ని తరలించాడానికి ఒక్కరంటే ఒక్కరు ముందుకురాని అనాగరిక సంఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని గుల్‌గోడి గ్రామంలో సంచలనం కలిగించింది. సొంత బంధువులు సైతం కాదని వెళ్లిపోతే పోలీసులే వృద్దుడికి మరో ముగ్గురు కొడుకులయ్యారు. వివారాల్లోకి వెళ్తే..  అసలప్ప అనే 80ఏళ్ల వృద్దుడు రోడ్డు దాటుతూ రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు. అయితే ఈ ప్రమాదాన్ని చూసిన చాలా మంది అక్కడ చూస్తు ఉండటం తప్ప ఏమీ చేయలేక పోయారు.

విషయం తెలుసుకున్న ఆయన కుమారుడు అసుపప్ప సంఘటనా స్థలానికి చేరుకొని తండ్రి శవాన్ని తరలించడానికి గొంతు పగిలేలా అరిచాడు. అయినా ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అదే రోజు స్థానికులు సూకట అనే పండుగ జరుపుకుంటున్నారు. పండుగ రోజు ఎవరైనా మృతదేహం దగ్గరి వెళ్తే వారి కుటుంబంలో కూడా అదే సంఘటన జరుగుతుందని భావించి ఏ ఒక్కరు సహాయం అందివ్వడానికి ముందుకు రాలేదు. ఎవరైన ముందుకు వస్తే వారికి గ్రామ ఆచారాల ప్రకారం వారికి ఆలయ ప్రవేశం నిషేధిస్తారు. ఈ కారణంగా అసలప్ప మృతదేహాన్ని తరలించడానికి ఎవరు ముందుకు రాలేదు.

తండ్రి మృతదేహం వద్ద అసుపప్ప పడిన రోదన చూసిన పోలీసులు మానవత్వం చాటుకున్నారు. తాము ఉన్నామంటూ ముందుకొచ్చారు. ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇంకో హోంగార్డులు తమ భుజాలపై మోసుకెళ్లారు. కొండమీద ఉన్న అసపప్ప ఇంటికి తరలించారు. అక్కడే దహన సంస్కారాలు నిర్వహించారు. తనకు సహాయం అందించిన పోలీసులకు అసుపప్ప కన్నీటితో కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు